in

Chicken Liver Fry Recipe In Telugu By Mana Vanta | Liver Curry In Telugu


Chicken Liver Fry Recipe In Telugu By Mana Vanta

Please Subcribe Us For New Recepies
చికెన్ లివ‌ర్ ఫ్రై
కావాల్సిన ప‌దార్థాలుః
చిన్నగా క‌ట్ చేసుకున్న లివ‌ర్
ఉల్లిపాయ‌లు
ప‌చ్చిమిర్చి
కొత్తిమీర
కారం
ఉప్పు
ప‌సుపు
ధ‌నియాల పొడి
గ‌రం మ‌సాలా
అల్లం వెల్లుల్లి పేస్ట్
నూనె

త‌యారీ విధానంః
ముందుగా స్ట‌వ్ వెలిగించి, బాణ‌లి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడ‌య్యాక ప‌చ్చిమిర్చి ముక్కలు, చిటికెడు ఉప్పు వేసి, ఉల్లిపాయ ముక్క‌లు కూడా వేసుకుని కాసేప‌య్యాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేయించుకోవాలి. ఇప్పుడు ప‌సుపు కూడా వేసుకుని ఒకసారి క‌లియ‌బెట్టి, చిన్న చిన్న‌గా క‌ట్ చేసుకున్న లివ‌ర్ ముక్క‌ల‌ను కూడా వేసుకుని సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇందులో కారం, మ‌రికొంచెం ఉప్పు వేసుకుని లివ‌ర్ పీసెస్ కు ప‌ట్టేలా క‌లియ‌బెట్టుకోవాలి. ప‌చ్చిమిర్చి ముక్క‌లు ఆల్రెడీ ఎక్కువ వేసుకున్నాం కాబ‌ట్టి, కారం కొద్దిగా వేసుకుంటే స‌రిపోతుంది. ధ‌నియాల పొడి, గ‌రంమ‌సాలా పొడి చిటికెడు వేసుకుని క‌లుపుకోవాలి. చివ‌ర‌గా, పైన కొత్తిమీర చ‌ల్లుకుని కాసేపు మూత‌పెట్టుకుని ఉడికించుకుంటే లివ‌ర్ బాగా కుక్ అయిపోయి ఉంటుంది. అంతే ఎంతో టేస్టీగా ఉండే లివ‌ర్ ఫ్రై రెడీ.
Check Out : How to Make Bagara Rice ::https://www.youtube.com/watch?v=R-78EKZTNVI

Also Checxk Chicken Curry | https://www.youtube.com/watch?v=7SQGCtDHGWA

source

Yummy Longan fruit dessert recipe – Cooking skill

Delicious Fruit Dessert Recipe In Minutes